మంత్రి పొన్నంపై పసలేని ఆరోపణలు చేయొద్దు : రమేశ్​ గౌడ్

మంత్రి పొన్నంపై పసలేని ఆరోపణలు చేయొద్దు :  రమేశ్​ గౌడ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన మంత్రి పొన్నం ప్రభాకర్​పై పసలేని ఆరోపణలు చేయడం కరెక్ట్​కాదని యువజన కాంగ్రెస్ నాయకుడు జెల్లా రమేశ్​గౌడ్ అన్నారు. గురువారం ఆయన మహేశ్వరంలో మీడియాతో మాట్లాడారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు శ్రమిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి అవినీతి మరకలు అంటించేందుకు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డాడు. కౌశిక్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటో బీఆర్ఎస్​హయాంలోనే బయటపడిందన్నారు.

అహంకార పూరితంగా గవర్నర్ ను విమర్శించిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఎమోషనల్​బ్లాక్ మెల్ చేసి గెలిచిన కౌశిక్.. పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. యాష్​రవాణాలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆధారాలు లేకుండా బీసీ మంత్రిపై ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు. సమవేశంలో నాయకులు మారగాని వేణు మాధవ్, కుంభం గోపాల్ పాల్గొన్నారు.