ఆర్మూర్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అనస్థీషియా (ఐఎస్ఏ) డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్మూర్ కు చెందిన డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ వో డాక్టర్ రమేశ్ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లో సంఘం ఎన్నికలు జరిగాయి. డాక్టర్ మహేశ్‌కుమార్ సిన్హా ఎలక్షన్ అబ్జర్వర్ గా, డాక్టర్ వీరేశం ఆఫీసర్ గా నిర్వహించిన ఈ ఎలక్షన్స్‌లో రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన వంతు బాధ్యతగా అందరికీ ఉపయోగపడేలా కార్యక్రమాలు చేపడతానన్నారు.
డాక్టర్రమేశ్ను ఆర్మూర్ లో జరిగిన అభినందన సభలో జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్అశోక్, డాక్టర్ రుద్ర శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, సీహెచ్ వో కృష్ణ మూర్తి, ఆండ్రోస్, సంపత్ పాల్గొన్నారు.