ఏపీ సర్కారు తెచ్చిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ‘చలో విజయవాడ’కు ఉద్యోగులు, టీచర్లు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా కిలోమీటర్ల మేర ఎటు చూసినా వాళ్లే కనిపించారు. జనం భారీగా తరలిరావడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో తనదైన శైలిలో స్పందించారు. ‘ఏపీ సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలి జ్వరం వచ్చేసింది. ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం నాకు షాక్ గా ఉంది. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా అని నా సందేహం.’అంటూ ట్వీట్ చేశారు వర్మ
A P సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయం తో చలి జ్వరం వచ్చేసింది??? pic.twitter.com/ImFu9oyciR
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2022