- రామగుండం సీపీ రెమా రాజేశ్వరి
గోదావరిఖని, వెలుగు : పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా బాధ్యత పెరుగుతుందని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్‌ఐగా పనిచేస్తూ.. ఎస్ఐగా పదోన్నతి పొందిన ఎనిమిది మందిని, హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తు ఏఎస్ఐగా పదోన్నతి పొందిన 10 మందిని, హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన 19 మందిని శుక్రవారం తన ఆఫీస్లో అభినందించారు. పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం పాల్గొన్నారు.