జ్యోతినగర్,వెలుగు: రామగుండం లో కొన్ని పాఠశాలలు, కాలేజీ బస్సులు ఫిట్ నెస్ టెస్టుల్లో భాగంగా పర్మిట్ లేని రెండు స్కూల్ బస్సుల పై శనివారం రామగుండం మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీం సింగ్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మోటర్ వెహికిల్ ఇన్స్సెక్టర్ మాట్లాడుతూ.. రామగుండం ప్రాంతంలో 66 స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెక్ చెస్తే 60 స్కూల్ బస్సులు కండీషన్ లో ఉన్నాయన్నారు.
ప్రతి బస్సులో పర్మినెంట్ డ్రైవర్,అటెండర్ ఏడాది పాటు ఉద్యోగంలో కొనసాగేలా స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. బస్సులో సైడ్ మిర్రర్, ప్రథమ చికిత్స్ కిట్ , బస్సుల పై సరైన అడ్రస్ ఉండాలని సూచించారు.