
గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్ కాలనీలోని అబ్దుల్ కలాం స్టేడియంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి స్మారక రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ సోమవారం ముగిసింది. రామగుండం, పాలకుర్తి టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రామగుండం జట్టు 147 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌గెలిచి బ్యాటింగ్ఎంచుకున్న రామగుండం జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 206 రన్స్చేసింది. ఇందులో కిశోర్ పటేల్51 బాల్స్‌లో 84 రన్స్‌చేసి నాటౌట్ గా నిలువగా, బాబర్ 22 బాల్స్‌లో 27 రన్స్‌చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాలకుర్తి జట్టు 16.3 ఓవర్లలో 59 రన్స్మాత్రమే చేసి ఆలౌట్ అయింది. 84 రన్స్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన కిశోర్ పటేల్ ప్లేయర్ఆఫ్ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఆయనకు నిర్వాహకులు మెమోంటోను అందజేశారు.