T20 World Cup 2024: మీ ప్రయోగాలకు ఒక దండం.. పాక్ క్రికెట్‌ను నాశనం చేయొద్దు: రమీజ్ రాజా

T20 World Cup 2024: మీ ప్రయోగాలకు ఒక దండం.. పాక్ క్రికెట్‌ను నాశనం చేయొద్దు: రమీజ్ రాజా

టీ20 వరల్డ్ కప్ 2024 లో బాబర్ అజామ్ లోని పాకిస్థాన్ జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న పాక్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ప్రయోగాలు ఎక్కువగా చేయడంతో వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. వరల్డ్ కప్ కు ముందు న్యూజిలాండ్ తో సిరీస్ ను చేజార్చుకుంది. ఆ తర్వాత ఐర్లాండ్ సిరీస్ తో మూడు టీ20ల సిరీస్ ను గెలిచేందుకు తీవ్రంగా శ్రమించింది.

తాజాగా ఇంగ్లాండ్ తో 0-2 తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా జట్టు యాజమాన్యంపై మండిపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ కాంబినేషన్‌లో మార్పులు చేయడంపై పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా మేనేజ్‌మెంట్‌ను తప్పుబట్టారు. జట్టు కాంబినేషన్‌లో ప్రయోగాలు చేయడం మానేయాలని రమీజ్ రాజా యాజమాన్యాన్ని కోరారు.  భారీ స్ట్రైక్ రేట్ చేసే ఆటగాళ్లు జట్టులో లేరని ఆయన గుర్తు చేశాడు. సరైన కూర్పు లేక టీమ్‌ను సర్వనాశనం చేశారని రమీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read:అతడి విధ్వంసానికి నిద్ర లేని రాత్రులు గడిపాను: రషీద్ ఖాన్

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 2009 లో మాత్రమే పాకిస్థాన్ చివరిసారిగా వరల్డ్ కప్ గెలిచింది. 2022లో చివరిసారిగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో పాకిస్థాన్ రన్నరప్ గా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఆదివారం (జూన్ 2) నుంచి జరగనున్న వరల్డ్ కప్ లో పాక్ తమ తొలి మ్యాచ్ ను అమెరికాతో ఆడుతుంది. జూన్ 6 న ఈ మ్యాచ్ జరుగుతుంది. బాబర్ అజామ్ పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాడు.