భారీ సేల్స్​ సాధించిన రామ్కీ

హైదరాబాద్, వెలుగు: రియల్టీ సంస్థ రామ్‌‌కీ ఎస్టేట్స్ అండ్​ ఫార్మ్స్ లిమిటెడ్ గత నెలతో పోలిస్తే రెట్టింపు అమ్మకాలను సాధించినట్టు తెలిపింది.  ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తన కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా లక్కీ డ్రా ద్వారా ఆకర్షణీయమైన బహుమతులు అందించింది. 1995లో కార్యకలాపాలను  ప్రారంభించినప్పటి నుంచి, కంపెనీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వరంగల్,  విశాఖపట్నం వంటి నగరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల నివాస వాణిజ్య స్థలాలను వినియోగదారులకు అందించింది . ప్రస్తుతం 15 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు అభివృద్ధి దశలో ఉన్నాయి . మరో 10 మిలియన్ చదరపు అడుగులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.