రామ్కీకి భారీ కాంట్రాక్టులు

రామ్కీకి భారీ కాంట్రాక్టులు

హైదరాబాద్, వెలుగు:  ఇంటిగ్రేటెడ్ సస్టైనబుల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌మెంట్ కంపెనీ  రామ్‌‌‌‌కీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్​కు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు రూ.215 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చింది.  ఐదేళ్లపాటు మ్యానింగ్, ఆపరేషన్  మెయింటెనెన్స్  సేవలను అందించనుంది. 

ఈ సేవలు 714.3 ఎంఎల్​డీ సామర్థ్యం గల ఇరవై మురుగునీటి శుద్ధి కర్మాగారాలకు అందించాలి.  ఇంటర్‌‌‌‌సెప్ట్  డైవర్షన్, సిస్టమ్‌‌‌‌ల నిర్వహణ బాధ్యతలు కూడా తామే చూస్తామని రామ్కీ  ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది.