న్యూఢిల్లీ : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా గోవిందయపల్లి రామ్మోహనరావు బాధ్యతలు స్వీకరించారని సంస్థ ప్రకటించింది. దర్యాప్తు, అంతర్గత తనిఖీ విభాగాలకు ఆయన నాయకత్వం వహిస్తారని తెలిపింది.
ఇంతకుముందు, రావు సెబీ రీజనల్ ఆఫీసుకు ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేశారు. తనిఖీలు, పెట్టుబడిదారుల సేవా కేంద్రాల ఏర్పాటు, పెట్టుబడిదారుల అవగాహన, ఫిర్యాదుల పరిష్కారాలతో సహా పలు పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షించారు. రావు మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు. ఆయన అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్ నుంచి సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ కూడా.