రాహుల్ గాంధీని కావాలనే ఇబ్బంది పెడుతున్నరు : రామ్మోహన్ రెడ్డి

రాహుల్ గాంధీని కావాలనే ఇబ్బంది పెడుతున్నరు : రామ్మోహన్ రెడ్డి

పరిగి, వెలుగు: సత్యం ఎప్పటికైనా జయిస్తుందని పరిగి మాజీ ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే ఆయనను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.  

రాహుల్​ది త్యాగాల కుటుంబం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని రామ్మోహన్​ రెడ్డి తెలిపారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.