ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు నానక్ రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో గంటలో ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
87 ఏళ్ల రామోజీ రావు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.