
ఈనాడు సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీ రావు మరణించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన శనివారం ఉందయం కన్నుమూశారు. ఆయన మరణంతో భారతీయ సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖులు, రాజకీయాల నాయకులూ ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.
ఇందులో భాగంగా.. రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ రామోజీరావుకి నివాళులు ఆర్పించారు. పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం, ఆయన లేని లోటు తీర్చలేనిది.. అంటూ గేమ్ ఛేంజర్ యూనిట్ పేర్కొంది. ఈ సంధర్బంగా.. రామ్ చరణ్, శంకర్, సునీల్, రఘు రామోజీ రావు గారికి నివాళులు అర్పించారు.