![రామోజీరావు భౌతికకాయానికి చంద్రబాబు దంపతులు నివాళి](https://static.v6velugu.com/uploads/2024/06/ramojirao-physical-body-tribute-by-tdp-leader-chandrababu_v7Y2XkDPGg.jpg)
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థివదేహం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మరణంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. రామోజీరావు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించామని.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారన్నారు. మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకమని అభిప్రాయపడ్డారు.. రామోజీరావుతో 4 దశాబ్దాల తనకు అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.