భారత్​లో మరో మూడు చిత్తడి నేలలు రామర్స్ జాబితాలోకి..

భారత్​లో మరో మూడు చిత్తడి నేలలు రామ్సర్​ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దీంతో భారత్​లో  రామ్సర్ ప్రదేశాల సంఖ్య 75కు చేరుకుంది. 1971, ఫిబ్రవరి 2న ఇరాన్​లోని రామ్సర్​లో చిత్తడి నేలలపై సమావేశం అంతర్​ ప్రభుత్వం ఒప్పందం జరిగింది. కన్వెన్షన్​ పేరు సాధారణంగా కన్వెన్షన్​ అండ్​ వెట్​ల్యాండ్స్​ అనే పేర్కొన్నారు. అయితే ఇది రామ్సర్​ కన్వెన్షన్​గా ప్రసిద్ధి చెందింది. సహజ వనరుల పరిరక్షణ, స్థిరమైన వినియోగంపై ఆధునిక ప్రపంచ అంతర్​ ప్రభుత్వ ఒప్పందాల్లో రామ్సర్​ మొదటిది. 1975లో అమల్లోకి వచ్చింది.

ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో 162 కాంట్రాక్టింగ్​ పార్టీలు లేదా సభ్య దేశాలు ఉన్నాయి. రామ్సర్​ ఒప్పందంలో అంతర్జాతీయ సంస్థ భాగస్వాములు అని పిలిచే మరో ఆరు సంస్థలతో కలిసి పనిచేస్తుంది. అవి.. బర్డ్​ లైఫ్​ ఇంటర్నేషనల్​, ఇంటర్నేషనల్​ యూనియన్​ ఫర్​ కన్జర్వేషన్ ఆఫ్​ నేచర్​, అంతర్జాతీయ నీటి నిర్వహణ సంస్థ, వెట్​ ల్యాండ్స్​ ఇంటర్నేషనల్​, డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ ఇంటర్నేషనల్​, వైల్డ్​ లైఫ్​ అండ్​ వెట్​ ల్యాండ్స్​ ట్రస్ట్​(డబ్ల్యూడబ్ల్యూటీ). ఈ సంస్థకు చెందిన నిపుణులు సాంకేతిక సలహాలను అందించడం, ఫీల్డ్​ స్టడీస్​ను అమలు చేయడంలో సాయం చేయడం, ఆర్థిక సాయం అందిస్తాయి. ఐఓపీలు పార్టీల కాన్ఫరెన్స్​ అన్ని సమావేశాల్లో పరిశీలకులుగా, సైంటిఫిక్​, టెక్నికల్​ రివ్యూ ప్యానల్​ పూర్తి సభ్యులుగా క్రమం తప్పకుండా పాల్గొంటాయి. 

ఇతర భాగస్వాములు 

జీవవైవిధ్యానికి సంబంధించిన కన్వెన్షన్​ ఆన్​ బయోలాజికల్​ డైవర్సిటీ, ది కన్వెన్షన్​ టు కంబాట్​ డెసర్టిఫికేషన్​, వలస జాతులపై కన్వెన్షన్​, వరల్డ్​ హెరిటేజ్​ కన్వెన్షన్​, అంతరించిపోతున్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై ఒప్పందం తదితర ఒప్పందాలు అమలులో ఉన్నాయి.