నిలిచిపోయిన రోడ్డు పనులు

నెక్కొండ, వెలుగు : వరంగల్​జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ రాములవారి గుట్టపై శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఇక్కడ నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కానీ, ఈ గుట్టకు వెళ్లే రహదారి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

గతంలోనే ఈ రోడ్డు ప్రారంభించగా, సదరు కాంట్రాక్టర్​ కంకర పోసి వదిలేశాడు. మరో మూడు రోజుల్లో శ్రీరామనవమి ఉండడంతో తాత్కాలికంగా పనులు చేపట్టి ఇబ్బందులను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.