Alekhya Chitti Pickles issue: మా అక్క తిట్టింది నిజమే.. మా వెర్షన్ కూడా వినండి : రమ్య కంచర్ల

Alekhya Chitti Pickles issue: మా అక్క తిట్టింది నిజమే.. మా వెర్షన్ కూడా వినండి : రమ్య కంచర్ల

అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం ముదురుతోంది. కష్టపడి పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ రాణిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళ పచ్చళ్ళ దుకాణం ఒక్క ఆడియో మెసేజ్ దెబ్బకి బంద్ అయ్యింది. అయితే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ మెసేజ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రోల్ అవ్వడంతో పాటూ ఎక్కువ మంది రిపోర్ట్ కొట్టడంతో వాట్సాప్, వెబ్ సైట్ లో కూడా ఆర్డర్స్ తీసుకోవడం లేదు. ఈ విషయంపై  ముగ్గురు అక్కాచెల్లెళ్ళలో ఒకరైన రమ్య మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. 

Also Read:-ఒకప్పుడు పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడిలా.. 

ఈ వీడియోలో అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ తన అక్క తిట్టింది వాస్తవమేనని తెలిపింది. అయితే తమకి రోజూ వేల కొద్దీ మెసేజులు వస్తుంటాయని ఇందులో కొందరు పికిల్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతోపాటూ టైమ్ పాస్ కి మెసేజులు పెడుతుంటారని చెప్పుకొచ్చింది. ఇంకొందరైతే ఏకంగా అసభ్యకరంగా తిడుతుంటారని ఈ క్రమంలోనే ఒకరికి పెట్టాల్సిన మెసేజ్ మరికొరికి షేర్ చేశామని ఇందుకుగానూ ఇప్పటికే సంబంధిత వ్యక్తికి క్షమాపణలు కూడా చెప్పామని క్లారిటీ ఇచ్చింది. కానీ కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ పచ్చళ్ళ బిజినెస్ పై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఇది సరికాదని వాపోయింది. అలాగే తాము తప్పు చేసినందుకు క్షమాపణలు చెప్పినా ఇప్పటికీ తమపై ట్రోలింగ్ ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అలేఖ్య చిట్టి పికిల్స్ కి చెందిన మరో ఆడియో బయటికొచ్చింది. ఇందులో కూడా ఓ మహిళతో మాట్లాడుతూ ముష్టి పచ్చళ్ళు కొనలేనిదానివి నాలుగు ఇళ్లల్లో పాచి పని చేసుకుని బ్రతకొచ్చు కదా అంటూ బూతులు తిట్టిన వాయిస్ వినిపిస్తోంది. దీంతో ఈ ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటివరకూ అలేఖ్య సిస్టర్స్ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారుకానీ అసలు ఆడియోలో మాట్లాడిన అలేఖ్య మాత్రం సైలెంట్ గా ఉంటోంది. అప్పటి వరకూ బాగా సాగిన పచ్చళ్ళ బిజినెస్ ఒక్క ఆడియో దెబ్బకి బంద్ అయింది. మరి అలేఖ్య చిట్టి పికిల్స్ దుకాణం మళ్ళీ ఓపెన్ అవుతుందో లేదో చూడాలి.