ఖమ్మంలో రంజాన్​ షాపింగ్​ సందడి..

రంజాన్​ సందర్భంగా బుధవారం రాత్రి ఖమ్మంలోని కమాన్ బజార్, కస్బా బజార్, వైరా రోడ్డు, ఇల్లందు రోడ్డు, న్యూ బస్టాండ్ రోడ్లలోని షాపింగ్ మాల్స్ రద్దీగా మారాయి. సేమియా, అత్తర్, దుస్తులు, ఇతర వస్తువులు కొనుగోళ్లలో ముస్లింలు నిమగ్నమయ్యారు. ఈద్గాలు అందంగా రంగుల రంగుల విద్యుత్​ దీపాలతో ముస్తాబయ్యాయి. 
- వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం