
హైదరాబాద్: ఇండియాలో బాక్సింగ్‌కు ఆదరణ పెంచేందుకు బాక్సింగ్ బే, స్పిరిట్ మీడియా ఫౌండర్ రానా దగ్గుబాటి అడుగులు వేస్తున్నాడు. ఈ మేరకు యూఎఫ్‌సీ చాంపియన్ ఆంథోనీ పెట్టిస్ ఫైట్ క్లబ్ (ఏపీఎఫ్‌సీ)తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. డిసెంబర్ తర్వాత ఇండియా, అమెరికాలో రెండు టోర్నీలను నిర్వహించనున్నాడు.
వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (డబ్ల్యూబీసీ)కి చెందిన ఆస్కార్ వల్లే, ఎరికా కాంట్రేరాస్ ఆధ్వర్యంలో గురువారం ఈ ఒప్పందాలు జరిగాయి. బాక్సింగ్ బే, ఏపీఎఫ్‌సీ మధ్య 5 వర్సెస్ 5గా పోటీలు జరగనున్నాయి. ఆంథోనీ ఫైట్ క్లబ్‌తో ఒప్పందం ఇండియన్ బాక్సింగ్‌లో మైలురాయిగా మిగిలిపోతుందని రాణా అన్నాడు. ఇండియన్ టర్ఫ్‌పై యూఎస్ బాక్సర్లకు ఆతిథ్యమివ్వడం వల్ల మనోళ్లకు కూడా అవకాశాలు భారీగా పెరుగుతాయన్నాడు.