మూవీ టీమ్తో రానా కల్లు దావత్.. ఫుల్లుగ తాగి రచ్చ రచ్చ

మూవీ టీమ్తో రానా కల్లు దావత్.. ఫుల్లుగ తాగి రచ్చ రచ్చ

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా కళ్ళు దావత్ చేసుకున్నడు. ఫులుగా కల్లు తాగిన రానా రచ్చ రచ్చ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రానా సమర్పణలో  ‘మసూద’ ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా నటించిన చిత్రం ‘పరేషాన్‌’.

 వాల్తేర్‌ ప్రొడక్షన్స్‌పై సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాని జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మై విలేజ్‌ షో టీమ్‌తో కలిసి సందడి చేశారు. మై విలేజ్ షో టీమ్ పరేషాన్ టీమ్ కు కళ్ళు దావత్ ఇచ్చారు.  ఇందులో భాగంగా.. రానా కళ్ళు తాగి పరేషాన్ చేశాడు. ఈ ప్రమోషనల్ వీడియో త్వరలోనే విడుదల కానుంది.

దీనికి సంబందించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో గంగవ్వ మాటలు, రానా సెటైర్స్ హైలెట్ గా నిలిచాయి.