
టాలీవుడ్ లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఉన్నట్లు తేలింది. దీంతో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ తదితర స్టార్ హీరోలపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై హీరో దగ్గుబాటి రానా పీఆర్ టీమ్ స్పందించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.. ఇందులో
ఇందులోభాగంగా "నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని గడువు 2017లో ముగిసింది. ఆన్‌లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్‌లను చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమెదం తెలిపారు. ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్ని భాగస్వామ్యాలను క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. చట్టపరమైన సమీక్ష తర్వాత, చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా ప్లాట్‌ఫామ్‌ను రానా అంగీకరించాడు.
నైపుణ్యం ఆధారిత గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను రానా దగ్గుబాటి ఆమోదించడం చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే నిర్ధారించడానికి ఈ ప్రెస్ నోట్ జారీ చేయబడుతోంది. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్‌లైన్ గేమ్‌లను హైలైట్ చేయడం చాలా అవసరం. ఈ గేమ్‌లు అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని మరియు అందువల్ల చట్టబద్ధంగా అనుమతించబడతాయని కోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు."
అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో స్టార్ హీరోలు మాత్రం చట్టానికి లోబడి నిబంధనలు అన్నీ తెలుసుకున్నా తర్వాత ప్రమోట్ చేశామని చెబుతున్నారు.. ఈక్రమంలో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ కూడా గతంలో రమ్మీ గేమ్స్ యాప్స్ ని ప్రమోట్ చేశామని సంజాయిషీ ఇచ్చారు. దీంతో పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ అంశాన్ని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.