ఫిల్టర్స్‌‌ లేని సెలబ్రిటీ షోతో రాబోతున్న హీరో రానా

మరోసారి సెలబ్రిటీ షోతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రానా.  ‘ది రానా దగ్గుబాటి టాక్ షో’ పేరుతో రాబోతున్న ఈ షో ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్‌‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం ఆ వివరాలను ప్రకటించారు.  దీన్ని హోస్ట్‌‌ చేయడంతో పాటు తనే క్రియేట్ చేసి, స్పిరిట్ మీడియా బ్యానర్‌‌పై నిర్మిస్తున్నాడు రానా. ఎనిమిది ఎపిసోడ్స్‌‌గా ఇది ప్రసారం కానుంది.  

దుల్కర్ సల్మాన్, నాగచైతన్య, సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, ఎస్‌‌.ఎస్‌‌.రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఇందులో పాల్గొంటారు.  సెలబ్రిటీల జీవితాల్లోని ఎవరికీ తెలియని కోణాలను ఎలాంటి ఫిల్టర్స్‌‌ లేకుండా అన్‌‌స్క్రిప్టెడ్‌‌గా అందించబోతున్నట్టు ఈ సందర్భంగా రానా తెలియజేశాడు. నవంబర్ 23 నుంచి ప్రతి శనివారం ఒక కొత్త ఎపిసోడ్ చొప్పున ఇది స్ట్రీమింగ్ కానుంది.