
బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బాపు’. దయా దర్శకత్వంలో రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘రెగ్యులర్‌కు భిన్నంగా ఉండే ఇలాంటి జానర్ సినిమాలు రావడం చాలా అరుదు.
సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని భావిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. మరో గెస్ట్‌గా హాజరైన హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘ట్రైలర్‌లో మట్టివాసన కనిపించింది. బ్రహ్మాజీ గారిని ఇలాంటి పాత్రలో చూడటం ఆనందంగా ఉంది’ అని అన్నాడు.
ఇదొక మంచి ప్రయత్నమని, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా అని బ్రహ్మాజీ అన్నాడు. సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని దర్శక నిర్మాతలు అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఆర్ ధ్రువన్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.