Rana Naidu: బోల్డ్గా రానా నాయుడు ట్రైలర్ 

Rana Naidu: బోల్డ్గా రానా నాయుడు ట్రైలర్ 

ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రానా నాయుడు ట్రైలర్ వచ్చేసింది. పాపులర్ అమెరికన్ వెబ్ సిరీస్ రే డోనోవర్ స్పూర్తితో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలో విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటిస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ని తెరకెక్కించారు.  ‘ఎవరైనా సెలబ్రిటీకి సమస్య వస్తే.. ముందు నీకే ఫోన్ వెళ్తుంది. ఫిక్సర్ ఫర్ ద స్టార్స్’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ‘ప్రతి బాలీవుడ్ స్కాండల్‌లో రానా నాయుడు పేరు వస్తుంది. రానా ఉన్నాడంటే ఆ స్కాండల్ పెద్దదని అర్థం’ అనే డైలాగ్‌తో రానా పాత్ర కనిపిస్తుంది. 

రానా తండ్రి నాగా నాయుడు (వెంకటేష్) పాత్రను కూడా పవర్ ఫుల్ గా చూపించారు. జైల్ నుంచి విడుదలైన నాగా, తన ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నట్లు చూపిస్తారు. రానాకు తన తండ్రి నాగాకు మధ్య గొడవ ఉందని ట్రైలర్ లో అర్థం అవుతుంది. ఇదే స్టోరీలైన్ తో కథ ముందుకెళ్తుంది. అయితే, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న గొడవలేంటి? నాగా ఫ్లాష్ బ్యాంక్ ఏంటీ? రానా చేసే పనేంటి? అని తెలియాలంటే.. మార్చి 10న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యేవరకు ఆగాల్సిందే.