'రణస్థలి'లో ఏం జరిగిందంటే..?

'రణస్థలి'లో ఏం జరిగిందంటే..?

ఏజె ప్రొడక్షన్స్, సురెడ్డి విష్ణు బ్యానర్ పై అనుపమ నిర్మించిన మూవీ రణస్థలి. పరశురామ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాల్ని పెంచిన మూవీ మేకర్స్.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగారా? లేదా? ఒకసారి చూద్దాం.

కథేమిటంటే..

బసవ, అమ్ములు ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్ములు.. బసవ ఇంట్లోనే పెరుగుతుంది. వీరిద్దరికీ పెళ్లి చేస్తాడు బసవ తండ్రి. ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సిన బసవ.. చేసిన అప్పు తీర్చడం కోసం చక్రవర్తి తోటలో పనికి చేరుతాడు. తోటలో పనిచేయడం కోసం నలుగురు కూళీలు వస్తారు. అయితే తోటకి వచ్చింది పనివాళ్ళు కాదు కిరాయి గుండాలు అని బసవకి తెలిసేలోపే.. చక్రవర్తిని, అమ్ములును చంపేస్తారు. అసలు ఆ గుండాలు ఎందుకు వాళ్లని చంపారు.? వాళ్ళని ఎవరు పంపించారు.? అసలు చక్రవర్తి ఎవరు? అనేదే ఈ సినిమా స్టోరీ.

ఎవరెలా చేశారంటే..

బసవ పాత్రలో యంగ్ యాక్టర్ ధర్మ బానే యాక్ట్ చేశాడు. యాక్షన్ సీన్స్ లో దుమ్ములేపినా... సెంటిమెంట్ పండించడంలో తాను ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది. చూడ్డానికి ఫుల్ మాస్ లుక్ లో ఉన్న ధర్మ... ఫేస్ లో ఇంకాస్త ఎక్స్ ప్రెషన్స్ కనబరిస్తే బాగుండేదేమో. అమ్ములు పాత్రలో చాందినీ రావు బాగానే యాక్ట్ చేసింది. తండ్రి పాత్రలో సమ్మేట గాంధీ జీవించేశాడు. ఇక విలన్ గా శివ, బెనర్జీ, చంద్ర శేఖర్, మధు మని, శ్రీనివాస్, ప్రశాంత్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఎలా ఉందంటే..

మూవీ స్టోరీ రెగులర్ కథే అయినా.. డైరెక్టర్ పరశురామ్ శ్రీనివాస్ తాను అనుకున్న పాయింట్ చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్, క్లైమాక్స్ కి ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం. అయితే మూవీలో ఎడిటింగ్ లోపం మాత్రం చక్కగా కనిపిస్తోంది. సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేసుంటే ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ అయ్యేవాళ్లు కాదు. ఫస్టాఫ్ తో పోలిస్తే... సెకండాఫ్, క్లైమాక్స్ సీన్స్ సినిమాకే హైలెట్. ఇక కేశవ కిరణ్ అందించిన బీజీఎం.. ఈ సినిమాకే ప్రాణమని చెప్పొచ్చు. మూవీ స్టార్టింగ్ నుంచి అయియేవరకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. 

టెక్నికల్ వాల్యూస్..

అయితే సినిమా చూస్తున్నంతసేపు... బడ్జెట్ ప్రాబ్లం ఉందేమో అన్న సందేహం కలుగుతుంది. ఇంకాస్త రిచ్ గా ఈ సినిమాని చూపించి ఉంటే... బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేది. ఈ మూవీలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నా.... యాక్షన్ లవర్స్ కి మాత్రం మంచి రా అండ్ రస్టిక్ మూవీ అనే చెప్పొచ్చు. జీజీఎం ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం థియేటర్ లో చూడాల్సిందే.

కొసమెరుపు: యాక్షన్ లవర్స్ కి మాత్రం మంచి రా అండ్ రస్టిక్ మూవీ