మనాలీలో ‘యానిమల్’

మనాలీలో ‘యానిమల్’

ఆలియా భట్‌‌‌‌‌‌‌‌తో మూడేళ్ల రిలేషన్‌‌‌‌‌‌‌‌కి పెళ్లితో శుభం కార్డు వేశాడు రణ్‌‌‌‌‌‌‌‌బీర్ కపూర్. ఈ నెల 14న ముంబైలో వీరి పెళ్లి జరిగింది. అయితే హనీమూన్ వెకేషన్‌‌‌‌‌‌‌‌లో ఉంటాడనుకున్న రణ్‌‌‌‌‌‌‌‌బీర్.. సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌లో జాయినయ్యాడు. పెళ్లి జరిగి పట్టుమని పది రోజులు కాకముందే ‘యానిమల్’ షూటింగ్ స్టార్ట్ చేసేశాడు. ‘అర్జున్‌‌‌‌‌‌‌‌ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రణ్‌‌‌‌‌‌‌‌బీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి జంటగా రష్మిక నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూటింగును నిన్న హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని మనాలీలో స్టార్ట్ చేశారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ‘అర్జున్‌‌‌‌‌‌‌‌రెడ్డి’తో తెలుగుతో పాటు హిందీలోనూ బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకున్న సందీప్‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. రణబీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా చూపించబోతున్నాడోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇక రణ్‌‌‌‌‌‌‌‌బీర్ నటించిన ‘బ్రహ్మాస్ట్ర’ రిలీజ్‌‌‌‌‌‌‌‌కి రెడీ అవుతోంది. రష్మిక కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది.