బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ(Nitesh Tiwari) రామాయణ(Ramayana) ఇతిహాసాన్ని తెరపై ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పటివరకు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, తాజాగా విడుదలైన కొన్ని ఫోటోలు ఈ విషయాన్నీ అధికారికంగా దృవీకరించాయి.
అవును.. తాజాగా రామాయణ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోలలో రాములవారిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపిస్తున్నారు. అయోధ్య యువ రాజుగా సాంప్రదాయ దుస్తుల్లో రణ్‌బీర్, యువరాణి సీతగా సాయి పల్లవి ఆకట్టుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. సీతారాములుగా ఇద్దరు బాగా సెట్ అయ్యారని, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:ఎట్టకేలకు OTTకి వచ్చేస్తున్న ఇండస్ట్రీ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇక రామాయణ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో లంకేశ్వరుడైన రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాకు ఆయన సహా నిర్మాతగా కూడా వ్యవహరించనున్నాడట. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మొత్తం మూడు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని సమయాచారం. మరి ఇన్ని అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.