Vijay Devarakonda : రౌడీకి జంటగా.. కీర్తి సురేష్

Vijay Devarakonda : రౌడీకి జంటగా.. కీర్తి సురేష్

సక్సెస్‌‌, ఫెయిల్యూర్స్‌‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో బిజీగా ఉంది కీర్తి సురేష్. పెళ్లి తర్వాత కూడా ఆమె బ్యాక్ టు బ్యాక్‌‌ మూవీస్‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.  ఇటు సౌత్, అటు నార్త్ రెండు చోట్ల ఆమె పేరు వినిపిస్తోంది. ‘బేబీ జాన్‌‌’తో బాలీవుడ్‌‌లో అదృష్టం పరీక్షించుకున్న ఆమెకు నిరాశ ఎదురైంది. అయినప్పటికీ మరో క్రేజీ ఛాన్స్‌‌ ఆమెను వరించినట్టు టాక్.  రణబీర్ కపూర్ హీరోగా నటించబోయే కొత్త చిత్రంలో హీరోయిన్‌‌గా ఆమెను సంప్రదిస్తున్నట్టు బాలీవుడ్‌‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం రణబీర్ వరుస చిత్రాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి కొంత టైమ్ పడుతుంది.  ఇక నితిన్‌‌ హీరోగా ‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కించబోయే ‘ఎల్లమ్మ’ కోసం కూడా కీర్తి సురేష్‌‌తో సంప్రదింపులు జరిగాయి.  

ఆ సినిమాపై ఇంకా క్లారిటీ రాకముందే మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌లో కీర్తి సురేష్‌‌ పేరు తెరపైకొచ్చింది.  విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్థన్‌‌’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. మొదట కన్నడ హీరోయిన్‌‌ రుక్మిణీ వసంత్‌‌ పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇప్పుడు ఆ స్థానంలో కీర్తిని తీసుకోబోతున్నట్టు సమాచారం. గోదావరి మాండలికంతో ఈ సినిమా ఉండబోతోంది. ఒకవేళ ఈ మూవీకి ఓకే చెబితే.. ‘దసరా’ కోసం గోదావరిఖని యాసలో డైలాగ్స్ చెప్పిన కీర్తి ఈసారి గోదావరి జిల్లాల యాస నేర్చుకోవాల్సి ఉంటుంది.  ఇక ప్రస్తుతం తెలుగులో ‘ఉప్పుకప్పురంబు’ అనే వెబ్‌‌సిరీస్‌‌లో కీర్తి నటిస్తోంది.