కూతురి కోసం సినిమాలకు దూరం.. రణ్బీర్ షాకింగ్ డెసిషన్

కూతురి కోసం సినిమాలకు దూరం.. రణ్బీర్ షాకింగ్ డెసిషన్

బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​బీర్​ కపూర్​(Ranbir kapoor) తన సినిమాలకు బ్రేకివ్వనున్నాడు. ప్రస్తుతం సందీప్​రెడ్డి వంగా(Sandeep reddy vanga)తో ఈ నటుడు యానిమల్(Animal)​లో నటిస్తున్నాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. యానిమల్ తర్వాత ఆరు నెలల పాటు మరో సినిమాకు సైన్​ చేయనని వెల్లడించాడు.

అందుకు కారణం తన కూతురు రాహా(Raha) అని తెలిపాడు. ‘తను పుట్టినప్పటినుంచి షూటింగ్స్​ కారణంగా తనతో సరిగ్గా సమయం గడపలేదు. ఇప్పుడు తను ఎదుగుతుంది. అన్నీ గుర్తిస్తుంది. ఈ ఆనంద క్షణాలను కోల్పోవాలని అనుకోవడం లేదు. అందుకే ఈ బ్రేక్’​ అంటూ రణ్​బీర్​ వివరించాడు. ఆలియా భట్​ను ఈ హీరో గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.