Animal teaser : పీక్స్‌ లెవల్‌లో వయోలెన్స్ ... యానిమల్ టీజర్ అదుర్స్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ యానిమల్ టీజర్‌ను రిలీజ్ చేశారు.  టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న  హీరోయిన్ గా నటిస్తోంది.  అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.  2 నిమిషాల 26 సెకన్లు ఉన్న చిత్ర టీజర్ సినిమా పైన అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది . 

టీజర్ చూస్తుంటే ఇందులో చాలా షేడ్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది.  కొన్ని చోట్ల రణ్ బీర్ కపూర్ ఎంతో కూల్‌గా కనిపిస్తే మరికొన్ని చోట్ల చాలా వయలెంట్ గా కనిపిస్తున్నాడు.  టీజర్ లో రణ్ బీర్ కపూర్ ను ఉద్దేశించి అనిల్ కపూర్ మాట్లాడుతూ జ్యోతి మనం క్రిమినల్ కొడుకుని కన్నామని అంటాడు. దీంతో  రణ్ బీర్ కపూర్ పాత్రలో చాలా షేడ్స్  ఉన్నట్లుగా కనిపిస్తుంది. 

నన్ను ఏ విషయం గురించి అడిగినా నిజాయితీగా ఆన్సర్ చెబుతాను. కానీ మా నాన్న గురించి మాత్రం అడక్కు అని హీరో చెప్పే డైలాగ్.. నా ఫాదర్ ఈ ప్రపంచంలోకెల్లా బెస్ట్ ఫాదర్ అనడం ఇలా అన్నీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వ్యక్తి ఎలా మారాడు.. ఏం చేశాడు? అన్న పాయింట్‌తోనే సినిమాను తీసినట్టుగా అనిపిస్తోంది.

నేను చెడును వెంటాడుతూ వెళ్లాను.. నాకు ఎక్కడా కనపడలేదు.. నాలో నేను చూసుకున్నాను.. నా కన్నా చెడ్డవాడు లేడు.. నాన్నా ఇది ఇప్పుడే మొదలైంది.. నేను వాడ్ని కనిపెట్టాలి.. కలవాలి.. చంపాలి.. మీరు నిరాశ పడకండి నాన్నా అంటూ రణ్ బీర్ చెప్పిన డైలాగ్స్ సినిమా మీద ఇంట్రెస్ట్‌ను పెంచేస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ చిత్ర డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.