అర్జున్ రెడ్డి (Arjun reddy) దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ యానిమల్(Animal). బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir kapoor), నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) జంటగా నటిస్తున్న ఈ మోస్ట్ వైలెంట్ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై నేషనల్ వైడ్ గా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ అండ్ టీజర్ ఆ అంచనాలను అమాంతం పేచేశాయి.
లేటెస్ట్ గా యానిమల్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ ఎమోషనల్ ఫీల్ తో సాగుతూ ఉంది. ‘నే వేరే నువ్వు వేరే..కాదు నేస్తమా’ అంటూ ఈ పాట సాగింది. అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ శ్రేయస్ పురానిక్ ఇచ్చిన సంగీతం వినసొంపుగా ఉంది. ఈ పాటను సింగర్ కార్తీక్ పాడారు.
రీసెంట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కుర్రకారును ఊపేసింది. అమ్మాయి అంటూ సాగిన ఈ మెలోడియస్ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక పాటలో రణ్బీర్, రష్మిక ల రొమాన్స్ పీక్స్ లో ఉంది. లిప్ లాక్స్ రెచ్చిపోయారు ఈ జంట.