స్పీడ్ పెంచిన సాయి పల్లవి.. మే నుంచి ‘రామాయణ 2’ షూటింగ్ కూడా స్టార్ట్

స్పీడ్ పెంచిన సాయి పల్లవి.. మే నుంచి ‘రామాయణ 2’ షూటింగ్ కూడా స్టార్ట్

డిఫరెంట్ స్ర్కిప్ట్‌‌లతో సెలెక్టివ్‌‌గా సినిమాలు చేస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటోంది సాయి పల్లవి. ప్రస్తుతం  సౌత్ టాప్ హీరోయిన్స్‌‌లో ఒకరిగా రాణిస్తూ దూసుకెళ్తోన్న ఆమె.. బాలీవుడ్‌‌ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా అనౌన్స్ చేయగా, ఇప్పటికే పార్ట్1కు సంబంధించిన  షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది.

ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు సెకండ్ పార్ట్‌‌ షూటింగ్‌‌ను కూడా స్టార్ట్ చేసే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మే నెలాఖరు నుంచి ‘రామాయణ 2’ షూటింగ్‌‌ మొదలు కానుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌‌లో ముందుగా  సాయి పల్లవిపై లంకలో సీన్స్ చిత్రీకరణ చేస్తారట. జూన్ నుంచి రణ్‌‌బీర్‌‌‌‌పై రాముడి పాత్రకు సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తారట.

దీంతో  సాయి పల్లవితో పాటు టీమ్ స్పీడ్ చూసిన బాలీవుడ్ జనం ఆశ్చర్యపోతున్నట్టు తెలుస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో  నమిత్ మల్హోత్రాతో కలిసి అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌‌తో  నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రావణాసురుడుగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్,  కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌ను 2026 దీపావళికి, సెకెండ్ పార్ట్‌‌ను 2027 దీపావళికి విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.