రణబీర్ ఫుట్‌బాల్ ఆ ఒక్కరితో ఆడరంటా..ఎవరో ఊహించగలరా?

రణబీర్ కపూర్(Ranbir Kapoor)..అలియా భట్(Alia Bhatt) జంట ఎంత ప్రత్యేకమో తెలిసిందే. రణబీర్ కపూర్ ఫుట్‌బాల్ ఆడటానికి ఇష్టపడతారనే విషయం తెలిసేందే.. అతను గేమ్ ఆడుతుంటే ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.

ఇటీవల ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ కోసం జెర్సీని ప్రారంభించిన రణబీర్.. ప్రీమియం స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మాట్లాడారు. అక్కడ హోస్ట్ ..'రణబీర్ సార్ మీరు ఎప్పటికీ  పుట్ బాల్ ఆడని ఆ వ్యక్తి ఎవరో చెప్పగలరా..అని అడిగిన ప్రశ్నకు.. రణబీర్ సమాధానమిస్తూ.. తన భార్య అలియా భట్ అని..ఆమె చాలా పోటీగా ఉంటుందని.. నేను ఆమెను ఓడించినట్లయితే, నేను చాలా కాలం బాధపడాల్సి వస్తుందని..కాబట్టి, నేను ఆమెతో ఆడటం మానేస్తానని అనుకుంటున్నాను.. ఒకవేళ  గేమ్ లో అలియా గెలిస్తే ఇక సెలబ్రేషన్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని.. హోస్ట్‌ రణబీర్‌ని ఆటపట్టించినట్లు తెలుస్తోంది. దానికి బదులుగా.. రణబీర్ కపూర్, "అవును, నేను రెండు విధాలుగా ఆలోచిస్తున్నాను " అని చమత్కరించారు. 

ALSO READ :పేరుమోసిన నాయకుడు.. అడ్డుగా హీరో.. ఇలా అయితే కష్టమే!

రణబీర్ కపూర్ ..అలియా గత నెలలో దుబాయ్‌లో విహారయాత్రకు వెళ్లిన విషయం తెలిసేందే. చాలా ఖుషీగా గడిపే ఈ జంటను చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతుంటారు.