న్యూఢిల్లీ: ఇండియా వెటరన్ ఆడ్మినిస్ట్రేటర్ రణ్‌ధీర్‌సింగ్.. ఒలింపిక్ కౌన్సిల్ ఆసియా (ఓసీఏ) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఇండియా తరఫున ఈ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచాడు. ఆదివారం జరిగిన 44వ జనరల్ అసెంబ్లీలో సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్‌సుఖ్ మాండవీయ సమక్షంలో 44 ఆసియా దేశాల ప్రతినిధులు రణ్‌ధీర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఒక్కరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. 2021 నుంచి యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న రణ్‌ధీర్ 2028 వరకు పదవిలో కొనసాగుతారు. పంజాబ్‌లోని పటియాలకు చెందిన 77 ఏళ్ల రణ్‌ధీర్ ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.