భూసేకరణ వేగవంతంగా చేపట్టాలి : కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

భూసేకరణ వేగవంతంగా చేపట్టాలి : కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
  • ఆర్అండ్ ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

సూర్యాపేట, వెలుగు: జిల్లాలోని నాలుగు కొత్త ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులను ఆర్​అండ్​ ఆర్​ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ... జిల్లాలో మంజూరైన బెట్ట తండా , రాజీవ్ గాంధీ , రెడ్ల కుంట, ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పథకాలు జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు.

 వీటి కోసం భూసేకరణ వేగవంతం చేసి ఇరిగేషన్ శాఖకు అప్పగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ పి రాంబాబు, ఇరిగేషన్ ఎస్సీ శివ ధర్మ తేజ, ఈఈలు సత్యనారాయణ, రామకిషోర్, డీఐఓ ప్రేమ్ చంద్ర, భూ సేకరణ విభాగం సూపర్ సీనియర్ అసిస్టెంట్ ఆకాశ్​, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.