
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సీనియర్ రగ్బీ టోర్నమెంట్‌లో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జట్లు చాంపియన్లుగా నిలిచాయి. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో సోమవారం జరిగిన మెన్స్ ఫైనల్లో రంగారెడ్డి టీమ్ 22–7 గోల్స్ తేడాతో నల్లగొండపై విజయం సాధించింది. మేడ్చల్ టీమ్ థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. విమెన్స్ ఫైనల్లో మేడ్చల్ 27-–0 గోల్స్ తేడాతో రంగారెడ్డి టీమ్‌ను చిత్తు చేసి టైటిల్ నెగ్గింది. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేంద్ర రామ్, జనరల్ సెక్రటరీ ఆదిత్య విన్నర్లకు ట్రోఫీలు అందజేశారు.