ఆన్ లైన్ యాప్ కు మరో యువకుడు బలి.. వేధింపులు భరించలేక విషం తాగి సూసైడ్

రంగారెడ్డి జిల్లా : ఆన్ లైన్ యాప్ కు మరో యువకుడు బలయ్యాడు. కరీంనగర్ కు చెందిన నరేష్ అనే యువకుడు శంషాబాద్ విమానాశ్రయంలో పని చేస్తున్నాడు. ఈ మధ్య ఆన్ లైన్ లో పలుసార్లు లోన్ తీసుకున్నాడు. అయితే.. సమయానికి డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆన్ లైన్ యాప్ నిర్వాహకులు నరేష్ ను వేధింపులకు గురి చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన నరేష్.. తాను నివాసం ఉంటున్న హాస్టల్ లో జులై 30వ తేదీ ఆదివారం ఉదయం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ విషయాన్ని గమనించిన హాస్టల్ నిర్వాహకులు.. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సొంతూరు సిరిసిల్ల అని తెలుస్తోంది.