బార్ అసోసియేషన్ కాలపరిమితిని రెండేళ్లు కొనసాగించాలి : కొండల్ రెడ్డి

బార్ అసోసియేషన్ కాలపరిమితిని రెండేళ్లు కొనసాగించాలి : కొండల్ రెడ్డి

ఎల్బీనగర్,వెలుగు: కోర్టులో స్టే ఉండగా బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను  వ్యతిరేకిస్తున్నామని బార్ అసోసియేషన్ ను రెండేళ్లు కొనసాగించాలని హై కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్, రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. 

ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ సన్నాహక సమావేశం ఆదివారం ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో   నిర్వహించారు.   బార్ కౌన్సిల్ న్యాయవాదుల సమస్యలు ఎక్కడా  పట్టించుకోలేదని,   కోర్టులో ఎలక్షన్స్ పై స్టే ఆర్డర్ ఉందన్నారు.  కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.