పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం : శశిధర్ రెడ్డి

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం : శశిధర్ రెడ్డి

ఎల్​బీ నగర్,వెలుగు: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం  జిల్లా కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా మొక్కలు నాటాలని, తద్వారా భవిష్యత్ తరాలకు శుభ్రమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం అందించినవారమవుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీదేవి అధ్యక్షతన  నిర్వహించగా, కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు మొక్కలు నాటారు.