బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మనోహర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. 2023 అక్టోబర్ 05 న మనోహర్ రెడ్డి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ భేటీ జరగనుంది .
Also Read :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోదరుని ఇంట్లో ఐటీ సోదాలు
ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ హాజరు కానున్నారు. కాగా మనోహర్ రెడ్డి తాండూరు నుంచి కాంగ్రెస్ తరుపున టికెట్ ఆశిస్తున్నారు. ఎల్లుండి ఢిల్లీలో మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.