స్కూల్ కి లేట్ గా వచ్చారని.. చెప్పులు లేకుండా విద్యార్థులను ఎండలో నిలబెట్టారు స్కూల్ యాజమాన్యం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ లోని హైదర్ షా కోట్ ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ కొత్త రూల్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలకు ఒంటిపూట బడులు ప్రారంభమవ్వడంతో విద్యార్థులు ఉదయాన్నే స్కూల్ కి రావాల్సి వస్తోంది. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు పలు సమస్యలతో బడికి టైమ్ కి రాలేకపోతున్నారు.
2024 మార్చి 16 శనివారం ఉదయం 15 నిమిషాలు స్కూల్ కి లేటుగా రావడంతో.. పాఠశాల ఆవరణలోని వరండాలో.. చెప్పులు లేకుండా విద్యార్థులను నిలబెట్టాడు ప్రిన్సిపాల్. హైదర్ షా కోట్ ప్రభుత్వ పాఠశాలలో.. హెడ్ మాస్టర్ సైదిరెడ్డి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇంతటి తీవ్రమైన శిక్ష ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు పేరంట్స్. ఎండలో నిలబెడితే.. అనారోగ్యం బారిన పడితే.. బాధ్యులు ఎవరిని నిలదీస్తున్నారు తల్లిదండ్రులు.
గ్రామాల నుంచి రావాలంటే కచ్చితంగా ఆర్టీసీ బస్సుకే రావాల్సి వస్తోందని.. ఆ బస్సు లేటుగా రావడంతోనే.. స్కూల్ కు ఆలస్యంగా వచ్చామని చెబుతున్నారు పిల్లలు. బస్సులు సమయానికి వస్తే.. స్కూల్ కు ఎందుకు లేటుగా వస్తామంటూ ప్రశ్నిస్తున్నారు పిల్లలు. ఆర్టీసీ బస్సులు సమయానికి వస్తే.. స్కూల్ కు చేరుకుంటామని.. తమతో పాటు టీచర్లు కూడా స్కూల్ కు లేటుగా వస్తున్నారని తెలిపారు విద్యార్థులు.