కోకాపేట్ గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ అరెస్ట్

 కోకాపేట్ గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ అరెస్ట్

రంగారెడ్డి జిల్లా కోకాపేట్ గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ EOW(ఎకానమిక్స్ అఫెన్స్  వింగ్ )అధికారులు చంద్రశేఖర్ ను అరెస్ట్  చేశారు. రూ.7 కోట్ల రూపాయల స్కామ్ చేశారంటూ  విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి EOW వింగ్ ను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు . ఈఓడబ్ల్యూ అధికారులు ఆధారాలు స్వేకరించారు. 

 చంద్రశేఖర్ పై  నార్సింగీ, గచ్చిబౌలి, రాయదుర్గంలో పలు సెక్షన్ ల కింద కేసులు నమోదయ్యాయి.  మూడు  పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు పోలీసులు.   ఫోన్ టాపింగ్ కేసు లో చంద్రశేఖర్ నిందితుడిగా ఉన్నారు.