రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఇనుప రాడ్ తో సొంత తండ్రిని.. మేనమామను దారుణంగా నరికి చంపాడు. దీంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ లో కుటుంబ తగాదాల్లో భాగంగా తండ్రితో పాటు మేనమామపై ఇనుప రాడ్ తో కొడుకు రాకేష్ దాడి చేశాడు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిచారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాకేష్ ను అదుపులోకి తీసుకొని.. విచారిస్తున్నారు పోలీసులు. ఆస్తి తగాదాల వల్లే రాకేష్ ఇలా చేశాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.