రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. నార్సింగిలోని మదర్సాలో గురువారం రాత్రి విద్యార్థుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. చిన్న వివాదంలో 12 ఏళ్ల బాలుడిపై తోటి విద్యార్థులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాలుడు స్పృహతప్పి కుప్పకూలాడు.
భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే బాలుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. బీహార్ కు చెందిన 12 మంది విద్యార్ధులు బాలుడి పై దాడికి పాల్పడ్డారు. దీనిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.