
అచ్చంపేట; వెలుగు: నల్లమల ప్రాంతంలో అతి పెద్ద జాతరైన రంగాపూర్ హజ్రత్ నీరంజన్ షావలి దర్గా ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు జాతరకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం రాత్రి అచ్చంపేట పట్టణంలోని నారాయణ ప్రసాద్ ఇంటి నుంచి గంధోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అచ్చంపేట, అమ్రబాద్, మన్ననూర్, కొల్లపూర్, నాగర్కర్నూల్, బొమ్మన్ పల్లి తదితర ప్రాంతాల నుంచి గందం తీసుకు వచ్చి దర్గాలో ఫతేహా ఇచ్చిన అనంతరం ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. దర్గాను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్వంశీ కృష్ణ సతీమణి అనురాద దర్శించుకున్నారు.