మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని ఏఐసీసీ పార్లమెంట్ పరిశీలకుడు రంగరాజన్ మోహన్ కుమార్ మంగళం అన్నారు. గురువారం డీసీసీ ఆఫీసులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కుటుంబపాలన నడుస్తున్నదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్నారు. కవిత ఈడీ కేసులో ఇది స్పష్టంగా కనిపించిందన్నారు. బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి అని ఎద్దేవాచేశారు.
డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, ఇతర నాయకులపై ఎఫ్ఎఆర్ లు నమోదు చేయడాన్ని ఖండిస్తూ 19న మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ కార్యాలయంలో తిరగబడదాం, తరిమికొడతాం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రొగ్రాంకు మధుయాష్కీ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహేశ్ కుమార్ గౌడ్ తదితర నాయకులు హాజరవుతారన్నారు. సమావేశంలో ఒబేదుల్లా కొత్వాల్, జంగయ్య యాదవ్, సంజీవ్ ముదిరాజ్, ప్రదీప్ గౌడ్, వినోద్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి..
మక్తల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఏఐసీసీ పార్లమెంటు ఇన్చార్జి రంగరాజన్ కుమార మంగళం అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని పార్టీ అఫీస్లో మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతు పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాగరాజు, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.