కలెక్టరేట్​ను రాజేంద్రనగర్​కు తీసుకొస్తం

కలెక్టరేట్​ను రాజేంద్రనగర్​కు తీసుకొస్తం
  • స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​

చేవెళ్ల/వికారాబాద్, వెలుగు: కొంగరకలాన్ లో కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను రాజేంద్రనగర్​కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రాంతం రాజేంద్రనగర్ అన్నారు. కొంగరకలాన్ దాకా వెళ్లేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజల విజ్ఞప్తి మేరకు కొంగర కలాన్ నుంచి రాజేంద్రనగర్ కు కలెక్టరేట్ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. చేవెళ్ల మార్కెట్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. కోల్డ్ స్టోరేజ్ కి ప్రపోజల్ పంపించాలని చెప్పారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వికారాబాద్​లోని సత్య భారతి ఫంక్షన్ హాల్ లో ‘యుద్ధం వద్దు– ప్రపంచ శాంతి కావాలి’ నినాదంతో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభ స్పీకర్​పాల్గొని మాట్లాడారు.