రంగారెడ్డి జిల్లా : అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన గ్రామపంచాయతీ సెక్రటరీ సక్రెటరీపై వేటు పడింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతి పేట్ గ్రామపంచాయతీ సెక్రటరీ రాజేష్ గౌడ్ ని సస్పెండ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేశారు. భూదాన్ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చినందుకు అధికారులు విలేజ్ సెక్రెటరీపై యాక్షన్ తీసుకున్నారు.
అవినీతిపై మండల ఎంపిఓ ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. భూదాన్ భూమి కాళీ స్థలంలో బిల్డింగ్ లు ఉన్నట్లు సెక్రటరీ అనుమతులు ఇచ్చాడు. కేసు నమోదైనప్పటికీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.