గచ్చిబౌలి, వెలుగు: పెండ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏండ్లు జైలు శిక్ష, రూ.5వేలు ఫైన్విధించింది. బాధిత మహిళకు రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. మొయినాబాద్మండలం నాగిరెడ్డిగూడెంకు చెందిన కాశీ విశ్వనాథ్(37)కు 2016లో అదే మండలానికి చెందిన యువతి పరిచయం అయింది.
పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నాడు. పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. పెండ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ముఖం చాటేశాడు. అదే ఏడాది ఫిబ్రవరి 18న బాధితురాలు మొయినాబాద్పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగారెడ్డి జిల్లా అడిషనల్జడ్జి ఎం.వాణి విచారణ అనంతరం శుక్రవారం తీర్పు ఇచ్చారు.