
పరిగి, వెలుగు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నేత మనోహర్ రెడ్డి గురువారం కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ విషయంపై బుధవారం రాత్రి మనోహర్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ లోకి వెళ్లడానికి ఇష్టపడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలకు ఆకర్షితుడినైనట్లు చెప్పారు. ఎలాంటి టికెట్ ఆశించడం లేదని, పార్టీపై అభిమానంతో వెళుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై గురువారం కాంగ్రెస్ పెద్దలతో కలిసి మీడియా ముందు వెల్లడించడానికి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తుంది.